- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు మురళీమోహన్‌కు భారీ షాక్.. క్రిమినల్ చర్యలు తప్పవా.!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్‌కు భారీ షాక్. ఆయనకు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై మాయని మచ్చ పడింది. దశాబ్దాల నిర్మాణ రంగంలోని సుదీర్ఘ అనుభవంలో తప్పులు దొర్లాయి. సొంత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపధ్యంలోనే జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్అనే సంస్థ అధినేత మురళీ మోహన్ హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరి […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్‌కు భారీ షాక్. ఆయనకు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై మాయని మచ్చ పడింది. దశాబ్దాల నిర్మాణ రంగంలోని సుదీర్ఘ అనుభవంలో తప్పులు దొర్లాయి. సొంత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపధ్యంలోనే జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్అనే సంస్థ అధినేత మురళీ మోహన్ హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరి సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సినీ నటుడు మాగంటి మురళీమోహన్, బిజినెస్ఎంటర్ప్రెన్యూర్మాగంటి రామ్మోహన్, సంస్థ డైరెక్టర్కిషోర్దుగ్గిరాలపై వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, మోసాలకు పాల్పడినందుకు సెక్షన్406, 420 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2001 నుంచి 2007 వరకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొత్తగూడలో జయభేరి సిలికాన్ కౌంటీ(జేఎస్సీ)ని నిర్మించారు. జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పేరిట పలువురు ఐటీ ప్రొఫెషనల్స్, ఇతరులకు ఫ్లాట్లను విక్రయించారు. జయభేరికి ముందు ఎంఎం ఫైనాన్స్‌ర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే 2003లో మధుసూదన్ బండ్రెడ్డి అనే వినియోగదారుడు జయభేరి సిలికాన్ బెటా కాంప్లెక్సులో ఫ్లాట్ నం.203ని కోనుగోలు చేశారు. దాని విస్తీర్ణం 3010 చ.అ.లుగా ఉంది. అలాగే కారు పార్కింగ్ కూడా ఉంది. సేల్‌డీడ్‌లో పలు అంశాలను పేర్కొన్నారు. కానీ, వాటిని అమలు చేయలేదు. చట్ట ఉల్లంఘనలు చేసినట్లు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. 2008 డిసెంబర్ 18న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ప్రమోషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్‌షిప్ యాక్టు 1987 కింద పోలీసులు దర్యాప్తు చేసి చార్జీ షీట్దాఖలు చేశారు. 2009 నుంచి ట్రయల్స్నడుస్తున్నాయి.
ట్రయల్‌కోర్టులో ఇది సివిల్అంశంగా పరిగణిస్తూ తీర్పు వెలువడింది. దీంతో వినియోగదారుడు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ అంశాలతో పాటు క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సిందేనని, వినియోగదారులను మోసగించినట్లుగా తెలుస్తున్నదని జస్టిస్ దుర్గాప్రసాద్ తీర్పు నిచ్చినట్లుగా హైకోర్టు న్యాయవాది పీఎన్ప్రవీణ్కుమార్ మంగళవారం ‘దిశ’కు వివరించారు. దీనిపై జయభేరి సంస్థ ప్రతినిధులు స్పెషల్ లీవ్పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా జయభేరి ప్రతినిధులు సమర్పించిన క్రిమినల్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. సేల్ డీడ్‌లో ప్రస్తావించిన ప్రతీ అంశాన్ని అమలు చేయాల్సిందేనని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. దీన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లుగా కనిపిస్తుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడినట్లు న్యాయవాది చెప్పారు. అపార్ట్‌మెంట్ యాక్టును ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.
యూడీఎస్‌లో తేడాలు..
జయభేరి సంస్థ దాఖలు చేసిన స్పెషల్లీవ్పిటిషన్ను న్యాయస్థానం సునిశితంగా పరిశీలించింది. మొదటి సాంక్షన్ప్లాన్, రెండో సాంక్షన్ప్లాన్కు మధ్య తేడాలున్నాయి. దీంతో, ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు లభించే స్థలం(అన్డివైడెడ్షేర్ఆఫ్ల్యాండ్)లో చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే వినియోగదారులకు వివరించలేదు. పైగా సేల్‌డీడ్‌లో ప్రస్తావించిన వాటిని వినియోగదారులకు సమకూర్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్నేండ్లుగా నిర్మాణ రంగంలో ప్రత్యేక ఒరవడిని కలిగిన జయభేరి సంస్థకు తొలిసారి షాక్తగిలింది. ఐతే సుదీర్ఘ కాలంగా జరిగిన విచారణలో వినియోగదారులకే అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.
సేల్‌డీడ్ అంశాలు.. ఉల్లంఘనలు
మెయిన్‌రోడ్డుకు పక్కన 7,322 చ.గ.ల ఖాళీ స్థలాన్ని చూపించారు. కానీ, దాన్ని జేఎస్టీ రియాల్టీ లిమిటెడ్(గతంలో డీహెచ్ఎఫ్ఎల్)కు 2005 లో విక్రయించారు. అలాగే 2007లో జయభేరి సిలికాన్టవర్స్ను నిర్మించారు. డ్రైవ్వే 24 అడుగులు అని చెప్పారు. కానీ దాన్ని 16 అడుగులకు పరిమితం చేశారు. హుడా ఆమోదించిన ప్రొసిడింగ్స్నం.జి/229/ఎల్పీ/2718/98, తేదీ.3.12.1999 ని ఉల్లంఘించినట్టు అయ్యింది. మూడు టవర్లు ఆల్ఫా, బీటా, గామాలతో పాటు జయభేరి సిలికాన్‌ల పేరిట నిర్మించారు. 18,521 చ.గ.ల్లో నిర్మించినట్లుగా సేల్ డీడ్‌లో ఉంది.
కానీ, అది 16,568.045 చ.గ.లకు పరిమితం చేశారు. వినియోగదారుడు మధుసూదన్బండ్రెడ్డి సర్వే ఇది ప్రకారం తేలింది. అంటే ఏకంగా 1953 చ.గ.ల స్థలాన్ని తగ్గించారు. ఉత్తరం దిక్కున 3,197 చ.గ.ల్లో క్లబ్నిర్మించారు. సేల్‌డీడ్‌లో క్లబ్‌హౌజ్‌తో పాటు ఎస్టీపీ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. కానీ, ఎస్టీపీ ఫ్లాట్ల యజమానుల సొంతం కాని దాన్ని జయభేరి సిలికాన్టవర్స్కు బదిలీ చేశారు. కేవలం వినియోగించుకునేందుకు పరిమితం చేశారు.
తీర్పును అంగీకరిస్తాం : దుగ్గిరాల కిషోర్, డైరెక్టర్, జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నాం. జస్టిస్ విల్ ప్రివెయిల్. 162 మంది సమూహంలో ఒకరిద్దరు అసంతృప్తికి గురయ్యారని అన్నారు.
Follow Dishadaily official Facebook Page : https://www.facebook.com/dishatelugunews







