- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth reddy : సీఎం కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ జోష్.. హోరెత్తిన రేవంత్ రెడ్డి నినాదాలు
<p>దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు భారీ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో భారీ బహిరంగ సభను.. సెప్టెంబర్ 17న నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సభ కోసం ఒక్కో పోలింగ్ బూత్‌కి 9 మంది చొప్పున రావాలని టీపీసీసీ చీఫ్ పిలుపునివ్వడంతో లక్షలాదిగా కాంగ్రెస్ శ్రేణులు గజ్వేల్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్ […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు భారీ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో భారీ బహిరంగ సభను.. సెప్టెంబర్ 17న నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సభ కోసం ఒక్కో పోలింగ్ బూత్‌కి 9 మంది చొప్పున రావాలని టీపీసీసీ చీఫ్ పిలుపునివ్వడంతో లక్షలాదిగా కాంగ్రెస్ శ్రేణులు గజ్వేల్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ సత్తా చూపెట్టేందుకు సిద్ధమైందని ఓ వైపు విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. గజ్వేల్ పరిసర ప్రాంతాలన్నీ కాంగ్రెస్ శ్రేణులతో కిటకిటలాడుతుండగా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది.
Strength of #Congress in CM’s own constituency Gajwel. #ChaloGajwel #Telangana pic.twitter.com/xsabdr7yhX
— Revanth Reddy (@revanth_anumula) September 17, 2021






