పసిడి బాండ్ల లాభాల వర్షం.. ఒక్క గ్రాముకు రూ.9 వేల ప్రాఫిట్

by Prasad Jukanti |   (  Updated:2025-11-06 11:04:35  IST  )

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.

పసిడి బాండ్ల లాభాల వర్షం.. ఒక్క గ్రాముకు రూ.9 వేల ప్రాఫిట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds) ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రిటర్న్స్ ఇస్తున్నాయి. 2017 నవంబర్ 6న జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్న్ తేదీని తాజాగా ఆర్‍బీఐ (RBI) ప్రకటించింది. ఎనిమిదేళ్ల ఏళ్ల కాలవ్యవధితో జారీ చేసిన ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఆర్‍బీఐ ప్రకారం 316 శాతం ప్రతిఫలం లభించింది. అంటే గ్రాముకు రూ.9121 చొప్పున ప్రాఫిట్ లభించింది. దేశంలో బౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015 నవంబర్ లో ఆర్‍బీఐ సావరిస్ గోల్డ్ బాండ్ల స్కీమ్ ను తీసుకువచ్చింది. 2017-18 సిరీస్ -VI బాండ్లకు సంబంధించి గ్రాము బంగారం ధర అప్పట్లో రూ.2895గా నిర్ణయించారు. అయితే ఆన్ లైన్ లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అదనంగా మరో రూ. 50 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఈ బాండ్లు మెచ్యూరిటీకి రావడంతో 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధర రూ. 12,066 గా ఆర్‍బీఐ నిర్ణయించింది. అంటే అప్పట్లో కొన్న ధర రూ.2895 మినహాయిస్తే ఒక్కో గ్రాముపై రూ.9121 లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా చెల్లించే 2.5 శాతం వడ్డీ అదనంగా దక్కనుంది.

Next Story