- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025లో తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం..ఎన్ని కోట్లంటే?
తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 2025 సంవత్సరంలో ఏకంగా రూ.1383.93 కోట్లు లభించాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే పాపులారిటీ సాధించిన తిరుమల శ్రీవారి ఆలయానికి రోజు రోజుకు ఆదాయం పెరుగుతోంది. క్రమంగా భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ అటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి తిరుమల శ్రీవారికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 2025 సంవత్సరంలో ఏకంగా రూ.1383.93 కోట్లు లభించాయి.
2024తో పోలిస్తే, 18 కోట్ల రూపాయలు అధికంగా వచ్చాయి. గత ఏడాది మొత్తంగా 2.61 కోట్ల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే లడ్డూ విక్రయాలలో కూడా తిరుమల దేవాలయం సరికొత్త చరిత్ర సృష్టించింది. 13.52 కోట్ల లడ్డూలు 2025 సంవత్సరంలో సేల్ అయ్యాయట. అదే 2024 సంవత్సరంతో పోల్చితే 1.37 కోట్లు ఈ సారి ఎక్కువ. డిసెంబర్ 27వ తేదీన గత 10 సంవత్సరాలలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.






