- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కందుర్పి శివారు ప్రాంతంలోని మల్బార్ షెడ్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్డులో భద్రపరచిన బిందు, తుంపర సేద్యం పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా భారీగా మంటలు ఎగసి పడటంతో చుట్టు పక్కల జనాలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగిందని తెలుస్తోంది. కాగా సమాచారం అందుకుని అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కందుర్పి శివారు ప్రాంతంలోని మల్బార్ షెడ్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్డులో భద్రపరచిన బిందు, తుంపర సేద్యం పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా భారీగా మంటలు ఎగసి పడటంతో చుట్టు పక్కల జనాలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగిందని తెలుస్తోంది. కాగా సమాచారం అందుకుని అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. కాగా ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియలేదు. అయితే నష్టం మాత్రం భారీగానే వాటిల్లిందనీ అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.
Next Story






