హృతిక్‌కు విజయ్ టైటిల్.. పూరి చాయిస్ ఏమై ఉంటుంది?

by  |
హృతిక్‌కు విజయ్ టైటిల్.. పూరి చాయిస్ ఏమై ఉంటుంది?
X

దిశ, వెబ్‌డెస్క్ : అభిమానుల కోరిక నిజం కాబోతుంది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, బ్యూటిఫుల్ దీపికా పదుకొనే ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయబోతున్నారు. ఈ మేరకు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా చేసిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘వార్’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ పేరుతో వస్తున్న ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. కాగా సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను మార్‌ఫ్లిక్స్ బ్యానర్‌ రూపొందిస్తోంది. సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ కానుండగా దీపిక, హృతిక్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుపుతూ.. ఇద్దరూ కలిసి నటించేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు.

కాగా పూరీ జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు హృతిక్ సినిమాకు ఈ టైటిల్ ఫైనల్ కావడంతో .. పూరి ‘ఫైటర్’ కన్నా పవర్‌‌ఫుల్ టైటిల్‌ ఏది ఫిక్స్ చేసి ఉంటాడని చర్చిస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.


Next Story