ఓకల్ ఫర్ లోకల్.. హృతిక్ సపోర్ట్

30

దిశ, వెబ్‌డె‌స్క్ :
‘ఓకల్ ఫర్ లోకల్.. స్థానికుల కోసం స్వరం వినిపిద్దాం’ అని పిలుపునిస్తున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. కరోనా వల్ల నష్టపోయిన లోకల్ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేయాలని సూచించారు. ‘వి ఫర్ హిమ్’ లోకల్ బ్రాండ్ గురించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రమోట్ చేస్తున్న హృతిక్.. ‘ట్రెడిషనల్ లుక్ ఫ్యాషన్ కాదని ఎవరన్నారు.. తనలా ట్రై చేయండి’ అంటూ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాడు.

హ్యాండ్ ఓవెన్, హాండిక్రాఫ్ట్స్ ట్రెడిషన్ గురించి అమ్మ నుంచి మరింత నేర్చుకున్నానన్న హృతిక్.. అమ్మ కూడా లోకల్ ఇండస్ట్రీ అభివృద్ధిని కోరుకుంటుందని.. హ్యాండ్ ఓవెన్ పాకెట్స్ కొనాలని సూచించారు. ఈ అందమైన కళను పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని, మన వారసత్వాన్ని ధరిస్తూ కొనసాగించాలని సూచించారు.