హృతిక్ కొడుకు మల్టీటాస్క్ యాక్ట్

by  |
హృతిక్ కొడుకు మల్టీటాస్క్ యాక్ట్
X

బాలీవుడ్ మన్మథుడు హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసుకున్నారు. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో తన కొడుకులతో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను ఫాదర్స్ డే సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ‘కొలంబో ఎయిర్‌పోర్ట్‌.. ఉదయం మూడు గంటల సమయం.. హృతిక్ తన కొడుకు హృదాన్‌ను చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. కానీ హృదాన్ అలిసిపోవడంతో నడుస్తూ కూడా నిద్రపోతున్నాడు’. అది కూడా చాలా కంఫర్ట్‌గా అంటూ వీడియో పోస్ట్ చేశాడు హృతిక్.

మరోవైపు హృహాన్ ఫాస్ట్‌గా వెళ్లి ఆల్రెడీ చెయిర్‌లో పడుకున్నాడని.. ఇచ్చిన మాట ప్రకారం హృదాన్ వస్తాడని తన పక్కన ఉన్న కుర్చీ ఖాళీగా ఉంచాడని వీడియోలో చూపించాడు. మొత్తానికి హృదాన్, హృహాన్ ఎప్పటికీ బెస్ట్ బ్రదర్స్.. అంటూ కొడుకులను చూసి మురిసిపోయాడు హృతిక్.

ఇదిలా ఉంటే, హృతిక్ నుంచి విడాకులు తీసుకున్న సుసానే ఖాన్.. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్నందున పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఇప్పుడు హృతిక్ ఇంట్లోనే ఉంటోంది.

Next Story

Most Viewed