ఖైదీగా హృతిక్?

by  |
ఖైదీగా హృతిక్?
X

కైథీ… తమిళ హీరో కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఖైదీగా వచ్చి సూపర్‌హిట్ అయింది. పదేళ్ల తర్వాత రిలీజైన ఓ ఖైదీ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని తన కూతురిని కలిసేందుకు చేసే ప్రయాణమే సినిమా. ఈ క్రమంలో భారీ యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే సన్నివేశాలతో గుండెలు బరువెక్కుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కార్తీ నటన వావ్ అనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపిన కార్తీ ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

ఈ సినిమానే హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో హిందీ రీమేక్ రాబోతోంది. ఈ సినిమాలో కార్తీ ప్లేస్‌లో బాలీవుడ్ స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ నటిస్తాడని టాక్. ఇప్పటికే ఖైదీ సినిమాను చూసిన హృతిక్… నిర్మాణ సంస్థకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే సినిమా పట్టాలెక్కినట్లే. వార్ మూవీ రిలీజ్ తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు హృతిక్ రోషన్. ఈ సినిమాకు కమిట్ అయితే హృతిక్‌లో మరో మాస్ యాక్షన్ చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు దక్కినట్లే.


Next Story

Most Viewed