కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

by  |
కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
X

దిశ వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్న ఫొటోలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలని ఉందా?.. అయితే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

1. www.cowin.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
2. ఆ వెబ్‌సైట్‌లోని రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్ అనే బటన్‌పై క్లిక్ చేయండి
3. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి
4. మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి
5. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ మీద క్లిక్ చేయండి
6. అక్కడ మీ ఫొటో ఐడీ ప్రూఫ్ వివరాలు ఇవ్వాలి.
7. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే యస్ అని లేకపోతే నో బటన్ మీద క్లిక్ చేయాలి
8. ఆ తర్వాత రిజిస్టర్డ్ బటన్ మీద క్లిక్ చేయాలి
9.రిజిస్ట్రేషన్ సక్సెస్‌పుల్ అయిన తర్వాత మీ అపాయింట్‌మెంట్‌ను ఫిక్స్ చేసుకోవాలి.


Next Story

Most Viewed