శంకర్‎పాలీ తయారీ చేసుకొండిలా..!

by  |
శంకర్‎పాలీ తయారీ చేసుకొండిలా..!
X

స్కూళ్లు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు బాగా ఆకలితో ఉంటారు. చాలామంది పిల్లలు భోజనం కాకుండా స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పిల్లలు ఇష్టంగా తినే స్విట్ శంకర్‎పాలీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్ధాలు: మైదా – 1/2కేజీ, రవ్వ – 1/4కేజీ, పాలు -అరకప్పు, నెయ్యి లేదా డాల్డా – ఒక కప్పు, పంచదార – 300గ్రాములు, ఉప్పు – చిటికెడు, నూనె -డీప్‌ఫ్రైకి సరిపడా తీసుకోవాలి.

తయారీ చేసే విధానం: ముందుగా ప్యాన్ లో నెయ్యి వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి తీసుకుని అందులో రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు, వేడి చేసిన నెయ్యి వేసి కలపాలి. దీనిలో పాలు పోస్తూ మెత్తటి మిశ్రమంగా వచ్చేంత వరకూ కలపాలి. దీనిపై ఒక క్లాత్ కప్పి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ చిన్న గారెల్లా తయారు చేసుకోవాలి. తర్వాత డైమండ్ ఆకారంలో లేదా మనకు గుండ్రని ఆకారంలో కట్ చేసుకోవాలి. మరోపక్క స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె కాస్త వేడయ్యాక కట్ చేసుకున్న వాటిని గోధుమ రంగులోకి వేయించుకుంటే స్వీట్ శంకర్ పాలీ రెడీ.. ఈ శంకర్ పాలీ పది రోజుల వరకు నిల్వ ఉంటుంది.



Next Story

Most Viewed