మొక్కజొన్న పకోడి.. ఇలా రెడీ

by  |
మొక్కజొన్న పకోడి.. ఇలా రెడీ
X

దిశ, వెబ్ డెస్క్ : మనం మొక్కజొన్నతో గుడాలు, స్వీట్ కార్న్, గారెలు, దోసెలు చేసుకుంటాము. కానీ మొక్కజొన్నతో చేసిన పకోడి తింటే దాన్ని మనం వదలలేము. అంత రుచిగా ఉంటుంది. ఇక ఆ రుచిని మీరుకూడ టేస్ట్ చేయాలిగా .. అందుకే మీకోసం వేడి వేడి మొక్కజొన్న పకోడి.

కావలసిన పదార్థాలు..

1.ఉడికించిన మొక్కజొన్నలు రెండు కప్పులు
2. వేయించిన శెనగ పిండి 1/2 కప్పు
3.నానబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు కప్పు
4. సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్
5.సన్నగా తరిమిన పచ్చి మిర్చి ఒక స్పూన్
6.ఉప్పు రుచికి సరిపడ
7.కారంపొడి 1/2స్పూన్
8.జిలకర పొడి ఒకస్పూన్
9.నూనె సరిపడ
10.కొత్తమీర ఒక కప్పు
11.కరివేపాకు

తయారీ విధానం..

మొక్కజొన్న గింజలను ఉడికించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాతా మిక్సీలో వేయించిన శనగపిండి, జీలకర్ర పొడి , ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్లీ ఒకసారి మిక్సీ పట్టాలి. అనంతరం టేబుల్ స్పూన్ అల్లం, పచ్చి మిర్చి , కరివేపాకు , కొత్తిమీర వేసి మెత్తగా కలపాలి. తర్వాత బౌల్ లో నూనె పొసి అది బాగా వేడి అయిన తర్వాత మొక్క జొన్న, శనగపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెసరపిండిలో ముంచి వేయించుకోవాలి. అంతే ఎంతగానో నోరూరించే మొక్కజొన్న పకోడి రెడీ. ఇక దీన్ని టమోటో సాస్ తో తింటే ఆ రుచే వేరు.



Next Story

Most Viewed