కిమ్ ఎందుకంత లావయ్యారు?

by  |
కిమ్ ఎందుకంత లావయ్యారు?
X

దిశ, వెబ్‌డెస్క్: కిమ్ జోంగ్ ఉన్.. ప్రస్తుతం ఈ పేరు అంతర్జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. అంతకు ముందు అమెరికాను ఢీకొట్టిన వ్యక్తిగా, ఆంక్షలకు వెరువక క్షిపణి ప్రయోగాలు చేపట్టిన వ్యక్తిగా మీడియాలో ప్రచారం పొందారు. కానీ, ఇప్పడు కిమ్ గురించి వేరే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్ కోమాలోకి వెళ్లాడని.. బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలను పక్కన పెడితే.. అతను రహస్య జీవితం గడపడం ఇదే తొలిసారి కాదు. కిమ్ పుట్టినప్పటి నుంచే అతని జీవితాన్ని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ రహస్యంగా ఉంచారు. 2011లో కిమ్ జోంగ్ ఇల్ చనిపోయే వరకు కొడుకు కిమ్ జోంగ్ ఉన్ గురించిన అన్ని విషయాలు రహస్యంగానే ఉండేవి. అసలు కిమ్ ఎప్పుడు పుట్టారో అనే విషయంపై కూడా స్పష్టత లేదు. కిమ్ పుట్టింది 8 జనవరి 1982 అని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. కానీ దక్షిణ కొరియా మాత్రం కిమ్ 8 జనవరి 1983లో పుట్టాడని, అమెరికా రికార్డుల ప్రకారం 1984లో పుట్టాడని చెబుతుంటారు. 2011లో తండ్రి చనిపోయిన తర్వాత అధికారం చేపట్టడానికి వీలుగా అతడిని పెద్ద వాడిగా ప్రచారం చేయడానికే ఉత్తరకొరియా పుట్టిన తేదీని మార్చారనే రూమర్లు ఉన్నాయి. ఇక కిమ్ విద్యాభ్యాసం స్విట్జర్లాండ్‌లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌, బెర్న్‌లోని పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. కిమ్‌కు ఫుట్‌బాల్ ఆడుతూ, వీడియో గేమ్స్ ఇష్టమని సన్నిహితులు చెబుతారు. కిమ్ తన బాల్యాన్ని సరిగా ఆస్వాదించలేదని.. ఎప్పుడూ నార్త్ కొరియా సీక్రెట్ ఏజెంట్‌ల పహారాలోనే ఉండేవాడని అంటుంటారు. అందుకే చిన్నప్పటి నుంచే కిమ్‌లో ఏదో తెలియని అభద్రతాభావం ఉండేదని అంటుంటారు. నార్త్ కొరియా నుంచి, మలేషియన్ యూనివర్సిటీa నుంచి ఆయన రెండు డిగ్రీ పట్టాలు పొందారు.

కిమ్‌ మంచి భోజనప్రియుడు. చిన్నతనం నుంచి జున్ను ఎక్కువగా తినేవాడు. కేవలం కిమ్ కోసమే విదేశాల నుంచి జున్నును ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంటోంది. జున్ను తినీ తినీ ఉబకాయం వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కిమ్‌కు తన తాత కిమ్ జోంగ్ సంగ్‌లా కనిపించడం అంటే ఇష్టం. ఆయనలా కనిపించడం కోసం కిమ్ ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

tags : Kim Jong Un, Dictator, North Korea, Childhood, School, College


Next Story

Most Viewed