టీవీలో మంటలొచ్చి ఇల్లు దగ్ధమైంది

by  |
టీవీలో మంటలొచ్చి ఇల్లు దగ్ధమైంది
X

దిశ, దుబ్బాక: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైన ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో సిద్దరబోయిన రమేష్ ఇంట్లో టీవీ ఆన్ చేయగానే ఒక్కసారిగా టీవీలో మంటలు వచ్చాయి. అనంతరం ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో పక్కనున్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో ఇంట్లో ఉన్నవారు వెంటనే బయటకు వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది.


Next Story

Most Viewed