- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026:న్యూ ఇయర్‌లో అదృష్టం వరించే రాశులివే.. వారికి ఉద్యోగం పక్కా!?
ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం రానే వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం రానే వచ్చింది. 2025 ఏడాదికి ముగింపు చెప్పి అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు. ఈ క్రమంలో గడిచిన ఏడాదిలో అనుభవించిన కష్టనష్టాలు నూతన ఏడాదిలో ఎదురు కావొద్దని కోరుకుంటారు. ఎన్నో ఆశలతో న్యూ ఇయర్‌లోకి అడుగుపెడతారు. ఇక, చాలా మంది 2026 లో తమకు ఎలా ఉండబోతుందోనని తెలుసుకోవాలని భావిస్తారు. ఈ తరుణంలో కొందరైతే జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తారు.
అయితే.. ఈ ఏడాది(2026) ఏ రాశుల వారికి అదృష్టం వరించనుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సర రాశి ఫలాలు ప్రకారం.. కర్కాటక, కన్య, తుల, మకర, రాశుల వారికి ఈ ఏడాది అత్యంత సానుకూలంగా ఉంది. మేష, వృషభ, మిథున, వృశ్చిక రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, ద్వితీయార్ధంలో పురోగతి కనిపిస్తుంది. సింహం, కుంభం, మీనం రాశుల వారు శని ప్రభావం వల్ల ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సింహ రాశి వారికి ఈ ఏడాది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరికి అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంది. కొంతకాలంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్లైతే ఆ సమస్యల నుంచి ఈ ఏడాదిలో ఉపశమనం కలుగుతుంది. ఈ ఏడాది తుల రాశి వారికి చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వింటారు. తాము కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. మొత్తంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ ఏడాది అనేక అవకాశాలను అందిస్తుంది.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.






