- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఈ రాశి వారికి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్.. 12 రాశుల ఫలితాలు ఇలా
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు(మంగళవారం) గ్రహ సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(మంగళవారం) గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సందర్భంగా 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
మేష రాశి
ఈ రాశి వారికి ఇవాళ గ్రహ బలం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభ రాశి
ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తి వారు బిజీగా ఉంటారు. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగే ఛాన్స్ ఉంది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఇవాళ రెండు కోరికలు తీరబోతున్నాయి. దీంతో చాలా సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు చేపట్టడానికి ఇదే మంచి సమయం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. పిల్లల నుంచి కొద్దిగా సమస్యలు ఎదురు కావచ్చు. ఆశించిన వివాహ సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి ఇవాళ ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తాగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. పని ఒత్తిడి పెరగడం వల్ల మీరు కోపానికి గురవుతారు. దీని వల్ల చిన్న చిన్న గొడవలు రావొచ్చు. ప్రేమలో ఎగుడుదిగుడు ను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగిఉండండి. వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య రాశి
విద్యార్థులు కష్టపడి చదివితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలతో సరైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల రాశి
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృధా ఖర్చు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఆకస్మిక ధన యోగం ఉంది. ఆదాయంలో లోటు ఉండదు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా.. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి బంధువర్గంలోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
కుంభ రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు తొందరగా పూర్తి కావు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
మీన రాశి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.






