- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఉగాది రోజు 12 రాశుల ఫలితాలు.. ఆ రాశి వారికి పెళ్లి శుభముహూర్తం దగ్గరలోనే!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా 12 రాశుల వారికి ఈ రోజు(గురువారం) ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ద్వాదశ రాశి ఫలాలు
మేష రాశి
ఈ రాశి వారు ఇవాళ ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల మార్పులు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో పండగ వాతావరణం, సంతోషం నెలకొంటుంది.
వృషభ రాశి
ఈ రాశి వారు అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు వచ్చే సూచన ఉంది. ఓపికతో ఉండటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.
మిథున రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
సింహ రాశి
ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచన ఉంది. పట్టుదలతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ఏడాది జూన్ నెల లోపు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కన్య రాశి
పనుల్లో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు.
తుల రాశి
శత్రువులపై విజయం సాధిస్తారు. పాత రుణాల నుంచి విముక్తి పొందే మార్గాలు కనిపిస్తాయి. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. రోజంతా ఆహ్లాదకరంగా గడుస్తుంది.
వృశ్చిక రాశి
శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ బాధలు తొలగుతాయి. పాత సమస్యలకు పరిష్కారం లభించే రోజు. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతాన పరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.
మకర రాశి
భూ, గృహ సంబంధిత పనులు వేగం పుంజుకుంటాయి. తల్లిగారి వైపు నుంచి తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబ సౌఖ్యం మరియు ధన లాభం చేకూరుతుంది.
మీన రాశి
జన్మరాశిలో గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
*ఈ రోజు ఉగాది పచ్చడిని సేవించి, సాయంత్రం పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.






