ఉగాది పంచాంగం : 12 రాశుల ఫలితాలు.. సంవత్సరంలో జరిగే విషయాలు తెలుసుకోండి!

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం : 12 రాశుల ఫలితాలు.. సంవత్సరంలో జరిగే విషయాలు తెలుసుకోండి!
X

మేష రాశి : క్రోధి నామ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆరంభం అసంతృప్తిగా ఉన్నా.. తర్వాత కలిసి వస్తుంది.

వీరు ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగం పొందడం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేపట్టి దాన్ని పూర్తి చేసి సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి : శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారికి ఈసంవత్సరం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతుంది. కానీ ఆకస్మిక నిర్ణయాల వలన నష్టపోతారు.

ఈ సంవత్సరంలో ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పదవుల్లో ఉన్న వారు, ఉన్నత పదవులు పొందుతారు.

మిథున రాశి : ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా మెప్పిస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు చాలా సంతోషంగా గడుపుతారు.

ఈ సంవత్సరంలో మీరు గతంలో చేసిన అప్పులను తీర్చుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. శని అష్టమంలో ఉండటం వలన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కానీ గురుడు శుభ స్థానంలో ఉండటం వలన కొంత వరకు కలిసి వస్తుంది. ఆనందంగా గడుపుతారు.

ఈ సంవత్సరంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు లాభిస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈ సంవత్సరం అస్సలే బాగాలేదు. అష్టమంలో రాహువు, దశమంలో గురువు మిమ్మల్ని అష్టకష్టాల పాలు చేస్తారు. ఏ పని ప్రారంభించినా పోరాటం చేస్తే కానీ ఫలితం సాధించలేరు. అనారోగ్య సమస్యలుంటాయి. అనవసర వివాదాలు వెంటాడుతాయి. ఆదాయం బాగానే ఉన్నా మనశ్శాంతి ఉండదు.

ఈ సంవత్సరంలో వీరు చేపట్టిన పనులు చాలా కష్టంగా పూర్తిచేస్తారు. కానీ విద్యార్థులు మంచి కళాశాలలో సీటు సంపాదించే అవకాశం ఉంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. సొంత పనులకంటే ఇతరుల పనులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ నుంచి ఉపకారం పొందే వారే మీకు కీడు చేస్తారు.

ఈ సంవత్సరం ఈ రాశి రియలెస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది.

తుల రాశి : ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. నిందలు ఎన్ని వచ్చినా మీరు అనుకున్నది చేస్తారు. దైవ బలం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ చేసి జీవితంలో సక్సెస్ అవుతారు.

ఈ సంవత్సరం ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి.

వృశ్చిక రాశి : ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి స్థానంలో ఉంటారు. గత సంవత్సరంలోని సమస్యల నుంచి బయటపడతారు. ఆనందంగా గడుపుతారు.

ఈ సంవత్సరం ఈ రాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

ధనస్సు రాశి :ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. కాకపోతే ఖర్చులు విపరీతంగా పెరగడం వలన కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది.

ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఇంటా బయట సంతోషంగా గడుపుతారు.

ఈ సంవత్సరంలో ఈ రాశి వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డ్స్ అందుకునే అవకాశం ఉంది.

కుంభ రాశి : కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. కానీ సెప్టెంబర్ వరకు మాత్రమే వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. తర్వాత నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈ సంవత్సరం రియలెస్టేట్ రంగం వారు మాత్రమే అధికంగా లాభాలు పొందుతారు.

మీన రాశి : ఈ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని ఉన్నా గురుబలం మంచి ఫలితాలను అందిస్తుంది. స్త్రీ మూలకంగా మీ జీవితంలో వెలుగు వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

ఈ సంవత్సరం వీరు ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం సాధిస్తారు.


Next Story

Most Viewed