Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు.. వారికి అదృష్టం వెంటే ఉంటుంది

by Jakkula.Mamatha |

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాబడతారు.

Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు.. వారికి అదృష్టం వెంటే ఉంటుంది
X

మేష రాశి

ఈ రాశివారు మనోబలంతో ముందుకు సాగితే అనుకున్న పని నెరవేరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని ఆరాధించడం మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విందు, వినోదాలలో ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల చిన్న చిన్న సమస్యలు దూరం అవుతాయి.

మిథునం

ఈ రోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. ఈశ్వర నామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటక రాశి

ఇది శుభసమయం. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. దీంతో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన చేయండి.

సింహరాశి

మనోధైర్యంతో ముందడుగు వేయండి. దైవబలం రక్షిస్తోంది. ముందడుగు వేసేటప్పుడు తోటివారి సలహాలు అవసరం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. వారం మధ్య భాగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఈశ్వర సందర్శనం, ఆంజనేయస్వామి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కన్య రాశి

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. సూర్య ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

తుల రాశి

ఈ రాశి వారు ఇవాళ ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ మహాలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. చంద్ర శ్లోకం చదవాలి.

ధనస్సు

ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. వివాదల్లో తలదూర్చకండి.శని శ్లోకం శుభప్రదం.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వారికి శుభ సమయం గా చెప్పవచ్చు. బుద్ధి బలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారు బద్ధకం వీడాలి. కష్టపడి పనిచేస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. అందరితో సంతోషంగా ఉంటారు. దీంతో చిన్న చిన్న సమస్యలు దూరం అవుతాయి. శ్రమ అధికం అవుతుంది. పనిలో ఒత్తిడి కూడా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Next Story