Today's horoscope: ఈ రోజు 12 రాశుల ఫలితాలు.. ఇలా చేస్తే పనిలో విజయం!

by Jakkula.Mamatha |

ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు.

Todays horoscope: ఈ రోజు 12 రాశుల ఫలితాలు.. ఇలా చేస్తే పనిలో విజయం!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు(ఆదివారం)మార్చి 1, 2026 చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. పుష్య నక్షత్ర ప్రభావంతో పాటు, కుంభ రాశిలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు. ఈ గ్రహ గతుల ప్రభావం మీ రాశి పై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలు వేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం శుభం.

వృషభ రాశి

ఈ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆవుకు గడ్డి తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి.

మిథున రాశి

ఈ రాశి వారు ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ఓపికగా వ్యవహరించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అప్పుల బాధల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల చదువుల విషయంలో శుభవార్త వింటారు. శివునికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహ రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. మీ నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. తండ్రి నుండి ఆస్తి సంబంధిత లాభాలు ఉండే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్య రాశి

ఈ రాశి వారు ఇవాళ పొదుపు పై దృష్టి పెడతారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆశించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు మార్గం సుగమం అవుతుంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గణపతికి గరిక సమర్పించడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి.

తుల రాశి

ఈ రాశి వారికి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థికంగా కలిసి రాదు. పోటీదారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. పని పై ఏకాగ్రత అవసరం. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. లక్ష్మీ దేవి ఆరాధన ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్‌లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో భాగస్వాముల సహకారం లభిస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం కలుగుతుంది.

ధనుస్సు రాశి

ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటి పనుల వల్ల కొంత అలసట కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దత్తాత్రేయ స్వామిని స్మరించడం శుభకరం.

మకర రాశి

ఆర్థిక పురోగతి ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని దేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల శాంతి కలుగుతుంది.

కుంభ రాశి

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తారు. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో లాభసాటి మార్పులు వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడతారు. శివ పంచాక్షరి మంత్రం జపించడం మంచిది.

మీనరాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నగదు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి వల్ల కొంత చిరాకు గా అనిపించవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక పర్యటనలు చేసే అవకాశం ఉంది. బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల జ్ఞానం, ప్రశాంతత లభిస్తాయి.

Next Story