- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscopes:ఈ రోజు రాశిఫలాలు(08-10-2025)
ఈరోజు రాశిఫలాలు తెలుసుకోండి.

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు పూర్తి చేయలేకపోతారు. అలాగే, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డబ్బు పొదుపుగా వాడటం నేర్చుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్ములను ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగుంది. సేవా దృక్పథంతో ఉంటారు. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి.
మిథున రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య విభేదాలు రావొచ్చు. అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరమేమీ లేదు. మీ కళాత్మకత, సృజనాత్మకతతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు విద్య సంబంధిత విషయంలో బాగుటుంది.
కర్కాటక రాశి
వీరికి దూర ప్రయాణాలు కలిసి రావు. ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయసహకారాలు పొందుతారు. ఇతరులతో ప్రేమగా మాట్లాడండి. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. పని నైపుణ్యాలను మెరుగు పరచుకోవడం, క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించడం అనేవి, ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవసరమౌతాయి. మీరు ఈ రోజు మొత్తం పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.
సింహ రాశి
ఈరోజు మీరు ఓ వ్యక్తిని కలుసుకుంటారు. వారియొక్క సలహా వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోగలరు. పూర్తికాని పనులు ఈరోజు పూర్తి చేయడానికి అనూకూలమైన రోజు. వైవాహిక జీవితం బాగుంటుంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఈరోజుమీయొక్క పనులకు విరామము ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాతంతను కలిగిస్తుంది.
కన్యా రాశి
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఓ వ్యక్తి మీ ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు.
తులా రాశి
ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సలహా వీరికి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. రావాల్సిన అప్పులు ఈరోజు తిరిగి పొందగలరు. డబ్బులు అధికంగా ఖర్చు చేయడం వల్ల ఇంట్లో గొడవలకు దారితీయొచ్చు. ఈ రోజు మీరు లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఆచితూచి అడుగు వేయాలి. విలువైన పత్రాలపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎప్పటినుంచో రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేస్తారు. కోపాతపాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు మంచి సమయం. పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది మీ మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మీ ప్రశాంతతను దూరం చేస్తోంది. దీంతో ఒత్తిడి గా ఫీల్ అవుతారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరీర్ పెరుగుదలకు వాడండి. దీని వల్ల మీ ఆఫీస్ లో అపరిమితమైన విజయాన్ని పొందుతారు. చాలా విషయాల్లో మొహమాటం, సిగ్గు పడటం వల్ల జీవితంలో ఎదగలేకపోతారు. వాటికి దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనానికి దోహదపడుతుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు.
కుంభ రాశి
ఓవర్ కాన్ఫిడెన్స్ మీ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్ధికపరమైన, కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలోచించి మాట్లాడండి. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయడం వల్ల కొంత మానసిక సమస్యలను తీసుకొస్తుంది. ఆఫీసులో మీకు ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. ఖర్చులతో కూడిన ప్రయాణం చేస్తారు. ఈరోజు వీరికి ప్రయాణాలు కలిసి వస్తాయి.
మీన రాశి
ఈ రాశి వారిని ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. యోగా, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. పిల్లల చదువు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.






