Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (15-04-2025)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-14 22:00:40  IST  )

బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు.

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (15-04-2025)
X

మేష రాశి:

బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు.

వృషభ రాశి:

మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

మిథున రాశి:

మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది.భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు.

కర్కాటక రాశి:

కుటుంబ సభ్యులకు సహాయపడండి. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.

సింహ రాశి:

నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

కన్యా రాశి:

అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

తులా రాశి:

మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.

ధనుస్సు రాశి:

ఓటమి పాలవుతారు. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

మకర రాశి:

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు.కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సెమినార్లు ఇస్తారు. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో కలిసి ఎక్జైటింగ్ పనులు చేస్తుంటారు. పెద్దవారి సలహాలు తీసుకుంటారు.

కుంభ రాశి:

జిమ్ కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు.కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఉద్యోగస్థులకు నేడు కలిసి వస్తుంది. ప్రమోషన్లు అందుకుంటారు. నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి.

మీన రాశి:

ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది. నేడు ఈ రాశివారు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు.

Next Story