- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today's Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే!?
ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

మేష రాశి
ఈ రాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అయితే.. ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోని వ్యక్తులను విమర్శించడం మానండి. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు.. కానీ అనుకోని అతిధి ఇంటికి రావడం చేత మీరు ఆ పనులను చేయలేరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది.
వృషభ రాశి
ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. దీంతో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గతంలో పారేసుకున్న పాత వస్తువులు మీకు దొరుకుతాయి.
మిథున రాశి
విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్నిస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. ఈరోజు మీరు మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకూరుస్తాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఇవాళ ప్రయాణాలు చేయాలని అనుకుంటారు. కానీ, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజులో కాస్త సమయమైన కుటుంబంతో గడపండి. లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు, ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
సింహ రాశి
ఈ రాశి వారు ఇవాళ తమకు ముఖ్యమైన వ్యక్తులుగా భావించే వారికి ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రారంభించిన పనుల్లో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. తోటివారి సహాయంతో మంచి ఫలితాలు లాభిస్తాయి. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించామని ఒత్తిడి చేస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. శ్రీరామనామాన్ని పఠించండి.
కన్య రాశి
ఈ రాశి వారు ఈరోజు అనవసర ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి విద్యార్థులకు కలిసివస్తుంది. స్నేహితులతో గడపడానికి సమయం దొరుకుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ జీవితం బాగుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
తులా రాశి
శుభకాలం.. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. ఈ రోజు అనుకోకుండా అతిథులు మీ ఇంటికి వస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.
వృశ్చిక రాశి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు చేసే ప్రయాణాలు కాస్త ఒత్తిడితో కూడుకున్నవిగా ఉంటాయి. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు మీ లోపాలను సరి చేసుకోవలసి ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ప్రారంభించిన పనులు తోటి వారి సహకారంతో చక్కబెడతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, సంతోషదాయకమే. మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు.
మకర రాశి
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ అభిమాన కల నెరవేరుతుంది. ఈరోజు రుణ సమస్యలు తీరుతాయి. ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. అనుభవజ్ఞులను కలుస్తారు, వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. వైవాహిక జీవితం బాగుంటుంది.
కుంభ రాశి
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెడ/ వెన్నులో విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశం ఉంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలా ఉంటాయి. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది.
మీన రాశి
ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి భాగస్వాములపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.






