- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఈ రోజు రాశి ఫలాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం కారణంగా ఇవాళ(మార్చి 31,2026) రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం కారణంగా ఇవాళ(మార్చి 31,2026) రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
మేష రాశి
ఈ రాశి వారికి ఇవాళ పనులు సకాలంలో పూర్తవుతాయి. ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడికి లోనవుతారు. లలితా సహస్రనామ పారాయణం శుభకరం.
మిథున రాశి
మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామాలను పఠించండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. గృహ వాతావరణం అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభప్రదం.
సింహ రాశి
ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.
కన్య రాశి
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం. ఎవరికీ హామీలు ఇవ్వకండి. సంకటనాశన గణేశ స్తోత్రం చదవడం మేలు చేస్తోంది.
తుల రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది. కానీ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. మహాలక్ష్మి అష్టకం పఠించడం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి
శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ధన, వస్తు లాభం ఉంది. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు రాశి
పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. దైవ చింతన పెరుగుతుంది. దక్షిణామూర్తిని ధ్యానించండి.
మకర రాశి
మాతృ వర్గీయులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఒడిదుడుకులు తప్పవు. శివాభిషేకం లేదా శివ పంచాక్షరి పఠించండి.
కుంభ రాశి
ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నవగ్రహ స్తోత్రం పఠించడం మేలు.
మీన రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంది. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. దత్తాత్రేయ స్వామిని పూజించండి.






