Today's horoscope: ఈ రోజు రాశి ఫలాలు

by Jakkula.Mamatha |

ఈ రాశి ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. పని ఒత్తిడి తగ్గుతుంది.

Todays horoscope: ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి

ఈ రోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం ముఖ్యం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

మిథున రాశి

కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి

ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

సింహ రాశి

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి అడుగు వేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

కన్య రాశి

పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టదైవరాధన మేలు చేస్తోంది.

తుల రాశి

ఈ రాశి వారికి ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. శుభవార్తలు వింటారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

వృశ్చిక రాశి

ఈ రాశి ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

మకర రాశి

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కుంభ రాశి

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీన రాశి

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యాల పట్ల ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

Next Story