- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:(24-02-2026)ఈ రోజు రాశి ఫలాలు
మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజుగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మెండుగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూ హాజరయ్యే వారికి అనుకూల సమయం. కార్యాలయంలో మీ నిర్ణయాలకు ప్రశంసలు దక్కుతాయి. ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోవడం శుభప్రదం.
వృషభ రాశి
ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పని ఒత్తిడి వల్ల కొంచెం నిస్సత్తువగా అనిపించవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మౌనంగా ఉండటం మేలు.
మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది.పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. మీ మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం లేదా పాత మొండి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు.
కర్కాటకం రాశి
ఈ రాశి వారు ఈ రోజు కొంచెం ఓపికగా, నిదానంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. బాధ్యతలు పెరగడం వల్ల కొంచెం అలసటగా అనిపిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. మానసిక ఆందోళన కలగకుండా ధ్యానం చేయండి.
సింహ రాశి
మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టేవారికి ఇది కలిసి వచ్చే సమయం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య రాశి
ఈ రాశి వారికి ప్రశాంతమైన రోజుగా చెప్పవచ్చు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. వృత్తి రీత్యా లేదా వ్యక్తిగత కారణాల వల్ల చేసే ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
తుల రాశి
ఈ రాశి వారికి వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. విలాసాల కోసం ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
వీరు ఈ రోజు సహనంతో మరియు పట్టుదలతో వ్యవహరించాలి. ఈ రోజు కొంచెం కోపం లేదా చిరాకు కలిగే అవకాశముంది. మాట తీరు పై నియంత్రణ అవసరం, లేదంటే అనవసర వివాదాలు రావచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా లభిస్తుంది. పట్టుదలతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లేదా అలసట ఉండవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి
ముఖ్యమైన పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ, మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. పాత మొండి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
కుంభ రాశి
గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యల నుండి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు లాభిస్తాయి.
మీన రాశి
ఈ రాశి ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన సమయం. మీ పనికి తగిన గుర్తింపు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా వేతన పెంపు గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఆరోగ్యం బాగుంటుంది.






