Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు (10-2-2026)

by Batti.Sumithra |

ఈరోజు రాశిఫలాలు తెలుసుకోండి.

Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు (10-2-2026)
X

మేష రాశి

ఈ రాశివారు ఈ రోజు నిరాశా భావాలను దూరంగా పెట్టాలి. అవి మీ అవకాశాలను తగ్గించి ఆరోగ్యం పై ప్రభావం చూపవచ్చు. ఆర్థికంగా మెరుగుదల కనిపించినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో పరిచయం ఉన్న వ్యక్తి ఒకరు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రేమ విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది.

వృషభ రాశి

ఈ రోజు ఈ రాశివారు సరదాగా సమచాన్ని గడుపుతారు. వ్యాపారస్తులు బయటకు వెళ్లినప్పుడు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం వహించాలి. ప్రేమ విషయాల్లో అనుకూలత ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఈ రోజు ఒక మంచి సర్‌ప్రైజ్ అందే అవకాశం ఉంది.

మిథున రాశి

ఈ రోజు మీలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కార్యాలయ పనుల్లో అతిగా మునిగిపోవడం వల్ల జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అవసరం లేని విషయాల పై సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

ఈ రోజు మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థికంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ అభిప్రాయాలను ఇతరుల పై బలవంతంగా రుద్దకండి. అది అనవసరమైన అపార్థాలకు దారి తీస్తుంది. మీ బిజీ జీవితం మధ్యలో మీకోసం కొంత సమయం కేటాయించండి.

సింహ రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం ఉత్సాహంగా ఉంటుంది. గతంలో ఇతరుల సూచనలతో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను అందించే అవకాశముంది. ఇంటి విషయాల్లో చిన్నచిన్న అపార్థాలు పెరగవచ్చు. ప్రముఖులతో చర్చల వల్ల కొత్త ఆలోచనలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.

కన్యా రాశి

ఈరోజు మీరు గొప్ప వ్యక్తులను కలుస్తారు. వారితో సంకోచం వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ప్రేమ విషయంలో మధుర అనుభూతులు కలుగుతాయి. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పనివత్తిడి వల్ల కొంత అసహనం కలుగుతుంది. దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటారు.

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారికి కొంత శారీరక అలసటత కలుగుతుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల నెమ్మదిగా ఉత్సాహం వస్తుంది. అదనపు ఆదాయం పొందాలనే ఆలోచన ఉంటే ఆర్థిక పెట్టుబడుల వైపు దృష్టి పెట్టడం మంచిది. ఈ రోజు మీరు మీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహచరుల నుంచి మంచి సహకారం లభిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కోసం సేవా కార్యక్రమాలు చేయడం మంచిది. ఈరోజు ధనాన్ని సరైన విధంగా వినియోగించుకోవడం నేర్చుకుంటారు. స్నేహితులతో గడిపే సమయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికల పై భాగస్వాముల ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు ఈ రాశి వారి మనసు కొంత అస్థిరంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యల నుంచి సహాయం, అండ లభిస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. వృత్తి పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేయడం వల్ల మనుసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వారు గాలిలో మేడలు కట్టుకుంటూ టైమ్ వృథా చేయకండి. ఈ రోజు వీరికి ఊహించని విధంగా డబ్బు చేతికి వస్తుంది. ఇంట్లో శాంతి ఉండాలంటే కొంచెం కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నవారు కొన్ని విషయాల్లో ఉండాలి. ఈ రోజు మీకు మీ పాత వస్తువులు దొరుకుతాయి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు సరదాగా సమయం గడుపుతారు.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారి దయా గుణం వల్ల ఆనందాన్ని పంచుకునే అనేక సందర్భాలు ఎదురవుతాయి. ఊహించని మార్గాల్లో ఆదాయం అందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగినా ఒకరి నుంచి వచ్చే వార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది.

మీన రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఆర్థికంగా మెరుగుపడేందుకు జీవిత భాగస్వామితో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ వ్యవహారంలో మంచి అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. బయట ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాన్ని కలుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు.

Next Story