- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మేష రాశి : ఈ రోజు మీకు ఇష్టమైన వారిని కలుసుకుంటారు. వారికీ మీ ప్రేమ గురించి చెబుతారు. చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామి మధ్య గొడవలు అవుతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
వృషభ రాశి : ఈ రాశికి చెందినవారు విదేశాలలో సెటిల్ అవుతారు. మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి. ఇది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.
మిథున రాశి : ఈ రోజు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది.మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.
కర్కాటక రాశి : ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే.. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సహాయం కోసం ఎదురుచూసే వారిని ఆదుకుంటామని మాట ఇస్తారు. మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ ప్రైజ్ లు ఇచ్చి మిమ్మల్ని మార్చేస్తారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.
తులా రాశి: ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో గడుపుతారు. ఈ రోజు ఉదయం మీకు కొంచం అశాంతి కలిగించవచ్చును. ఈ రోజు సాయంత్రం మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో మీ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ఈరోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరుగుతాయి
వృశ్చిక రాశి: ఈ రోజు కొత్తగా ఆలోచిస్తారు. అలాగే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయంలో పుస్తకాలు చదువుతారు.
ధనస్సు రాశి : ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి: అనారోగ్య సమస్యల కారణంగా మీరు ఈ రోజు బయటకు వెళ్ళలేరు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ధూమపానం, మద్యపానము వంటి అలవాట్లను మానుకుంటేనే మంచిది. లేదంటే మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు, డబ్బు సమస్యలు ఎక్కువవుతాయి.
కుంభ రాశి: ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కానీ, కొన్ని ముఖ్యమైన విషయాలకు మీరు సమయాన్ని కేటాయించలేరు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది.
మీన రాశి: ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తాయి. మీకు ఏమి చెయ్యాలో కూడా తెలియదు. ఆర్ధిక సమస్యలు నుంచి బయటపడతారు. మీరు, ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది.






