Today Horoscope in Telugu : ఈ రోజు రాశి ఫలాలు

by Disha Web Desk 10 |
Today Horoscope in Telugu : ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారిలో ఉద్యోగులు సహోద్యోగుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా పని చేయాలి. అయితే వారు మీకు ఎలాంటి హాని చేయలేరు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో మీ మనసులో ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి పురోగతిని సాధిస్తారు. కానీ సంతోషంగా ఉండలేరు. ఈరోజు సాయంత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు పని చేసే చోట సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా సంస్థ నుండి డబ్బు తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే, మీరు ఈరోజు సులభంగా పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారిలో వ్యాపారులు కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పని చేస్తే, అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా డిమాండ్లు వస్తే వాటిని నెరవేర్చేందుకు కష్టపడి పని చేస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీ ఇంట్లో లేదా వ్యాపారంలో ఏదైనా వివాదాలు ఏర్పడితే, వాటిని పట్టించుకోకుండా పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి అవసరాలను తీర్చడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. విద్యార్థులు గురువుల సహకారంతో విద్యకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.

వృశ్చిక రాశి: వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతారు. ఈరోజు మీరు మీ పాత స్నేహితుడిని కలవడం వల్ల ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పని చేసే చోట కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారులకు పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సోదరుల సహకారంతో వాటిని తొలగించుకుంటారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి అవసరాలను తీర్చడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. విద్యార్థులు గురువుల సహకారంతో విద్యకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు పిల్లల వైపు నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీ ప్రభుత్వ పనులు ఏవైనా పెండింగులో ఉంటే, సీనియర్ అధికారుల సహాయంతో వాటిని పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు పిల్లల వైపు నుంచి కొన్ని ఊహించని వార్తలను వినొచ్చు. వ్యాపారులు ఈరోజు కొందరు పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాయంత్రం మీరు మీ స్నేహితుడిని కలుస్తారు. దీని వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది


Next Story