నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం

by Dishanational2 |
నేటి రాశి ఫలాలు.. ఈ రాశి  వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
X

మేష రాశి : ఈరోజు పిలవని అతిథులు మీ ఇంటికి రావడం మీకు ఆర్థికప్రయోజనాలను చేకూరుస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చుల అధికం అవుతాయి. కాబట్టీ ఖర్చుచేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నేడు మీజీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు త్వరగా నెరవేరుతాయి.

వృషభ రాశి :ఎన్నో పనులు మీకు భారంగా మారుతాయి. సెక్యూలేషన్ ద్వారా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డ్రైవింగ్ చేసే టప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు చాలా ఇష్టమైన వారు మీ మూడ్ పాడు చేస్తారు. నేడు మీరు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఆసక్తి చూపుతారు.

మిథున రాశి : ఈ రోజు ఈ రాశి వారు తమ సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఈ రాశి వారు నేడు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి : ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఒప్పందాలు లబ్ధి చేకూరుస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు అటెండ్ కాబోయే సెమినార్లు, మీరు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

సింహ రాశి : కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థంచేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి.అది మీకే ఇబ్బందులను తీసుకొస్తుంది.

కన్యా రాశి : ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. చాలా కాలంగా రుణప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్న వారి రుణసదుపాయం లభించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఈ రోజు ఈ రాశివారికి సానుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కంటె పెద్దవారి నుంచి మీరు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తారు. కానీ మీకు తెలియకుండానే మీ చేతిలోని ధనం ఖర్చు అవుతోంది. ఆఫీసులో సంతోషకరంగా గడుపుతారు, ప్రతీదీ మీకే అనుకులంగా ఉండటం మీకు సంతోషాన్నిస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.

ధనస్సు రాశి : ఈరోజు మీరు మీ బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామి మీరు చేసే ప్రతీ పనికి సపోర్టీవ్‌గా ఉంటుంది. ఆఫీసులో ఒత్తిడి అధికం అవుతుంది. ముఖ్యమైన, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

మకర రాశి :ఈరోజు మీ భయమే మిమ్ముల్ని బలహీనులను చేస్తుంది. దాన్ని తొలిగించుకొని ఆత్మగౌరవంతో ముందు అడుగు వేయండి. నేడు మీరు ఇతరుల సహాయ సహకారాలు లేకుండా ధనార్జన చేయగలరు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యక్తిగ వ్యవహారాలు అదుపులో ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి.

కుంభ రాశి :ఈ రోజు మీరు మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీరు మానసిక తృప్తి పొందుతారు. కుటుంబంలోని టెన్షన్లు మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తాయి.చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఈ రోజు నిరాశ తప్పదు.

మీన రాశి : ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారిఖర్చులను నియంత్రించుకొనిఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.

Also Read..

Telugu Panchangam 17 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!


Next Story

Most Viewed