నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి నేడు అద్భుత ఫలితాలు

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి నేడు అద్భుత ఫలితాలు
X

మేష రాశి :ఈ రోజు ఈరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశి వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. మీ ప్రవర్తన ఈ రోజు మీ స్నేహితులను బాధిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృషభ రాశి : అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకు కారణం కాగలదు. నేడు ఆర్థికసమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మీరు ఇతరుల విషయాలలో జోక్యంచేసుకోకపోవడమే ఉత్తమం. ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

మిథున రాశి : మీ సౌమ్య ప్రవర్త మెప్పు పొందుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీరు కొత్తగా వ్యాపారాలు చేసే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

కర్కాటక రాశి : ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇప్పటిదాక అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నవారు, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు.పని చేసే చోట ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో చిన్న కలతలు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి : ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయడం వలన ఒత్తిడి కలిగిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ఇష్టమైన దేవున్ని ప్రార్థించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి : ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఐ టి తదితర వృత్తి నిపుణులకు సమయం చాలా బాగుంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

తుల రాశి : ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ కాస్తంత ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల మంచి జరుగుతుంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి : ఆర్థికంగా బాగుంటుంది. మీ మూడీ ప్రవర్తన మీ ప్రియమైన వారిని సమస్యల్లో నెట్టేస్తుంది. సహోద్యోగులతో సమస్యలు ఎదుర్కొంటారు.చాలా రోజుల నుంచి ఎరైతే రుణ ప్రయత్నాలు కోసం ప్రయత్నిస్తారో వారికి కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మాటలు పడాల్సి వస్తుంది.

ధనస్సు రాశి : ఈరోజు మీ టెన్షన్స్ అన్నీ తగ్గుతాయి. తోబుట్టువులయొక్క సహాయసహకారముల వలన మీరు ఆర్ధికప్రయోజనాలను అందుకుంటారు.కావున వారియొక్క సలహాలను తీసుకోండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. వ్యాపారల్లో పెట్టుబడి పెట్టే వారికి కలిసి వస్తుంది. నిరుద్యోగుకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి: స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే పెట్టు బడి పెట్టారో వారికి అత్యధికలాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి.ఈ రోజు మీ స్నేహితులు మిమ్ముల్ని ధనం అప్పు అడిగే అవకాశం ఉంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కుంభ రాశి : రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోని ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకున్న లాభాలు వచ్చే అవకాశం లేదు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు. కుటుంభ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి : వ్యాపరస్తులకు కలిసి వస్తుంది. ఈ రాశివారు నేడు శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో మిత్రులు సహాయ, సహకారాలు అందిస్తారు. చాలా కాలం నుంచి వసూలు కానీ డబ్బు అనుకోకుండా చేతికందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Also Read: Telugu Panchangam 16 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!


Next Story

Most Viewed