నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని అదృష్టం

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని అదృష్టం
X

మేష రాశి: ఈరోజు అదృష్టం మీ వైపే ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాలకు మంచి సమయం. అనుకున్నవన్నీ నెరవేరుతాయి.ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు.

వృషభ రాశి : వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. నేడు ఈ రాశి వారు అధిక ఖర్చులు చేసి సమస్యల్లో చిక్కుకుంటారు. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించడం మంచిది. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపుటంచులను చవిచూస్తారు

మిథున రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ట్రేడ్ రగంలో ఉన్నవారు నష్ట పోక తప్పదు. శుభకార్యాలలో పాల్గొంటారు. నేడు మీరు ఓ అద్బుతమైన వ్యక్తిని కలుసుకోవడం జరుగుతుంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. భవిషత్తులో మీరు చేయబోయే మంచి పనులకు వాళ్ళు సహాయకారిగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రోజు కొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, పాత స్నేహితులు, సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఉద్యోగస్తులకు కలిసివస్తుంది. మీరు చేసే సేవలకుగాను ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది.

సింహ రాశి : పనిచేసే చోట, సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. బిడ్డ చదువు గురించి వర్రీ లేదు. ఈక్షణంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అవికూడా తాత్కాలికమే.

కన్యా రాశి : ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి. దగ్గర వారికి సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

తుల రాశి : కొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని చేపడతారు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

వృశ్చిక రాశి : జీవితంపట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. నిరుద్యోగులు వారికినచ్చిన ఉద్యోగము రావటము చాలాకష్టము.కాబట్టి మీరుమరింత కష్టపడి పనిచేయుట వలన మీరు మంచిఫలితాలు అందుకుంటారు. ఆఫీసులో చికాకులు అధికం అవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

ధనస్సు రాశి :శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పుఅడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం నిరాశకులోనయ్యేలా చేస్తుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

మకర రాశి :ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.

కుంభ రాశి : మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు ప్రయోజనకరంగా ఉటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతయి. కుటుంబంలోని గొడవలు కాస్త ఆందోళనకరంగా మారుతాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పువచ్చు. ఈ రాశి వారు నేడు పుస్తకాలు చదవడం ద్వారా సంతోషంగా ఉంటారు.

మీన రాశి :మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అధికంగా ఖర్చు చేస్తారు. అది మానుకోవడం మంచిది. పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధ వ్యవహారుల కొలిక్కి వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.


Next Story