ఈరోజు రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక నష్టం తప్పదంట!

by Dishanational2 |
ఈరోజు రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక నష్టం తప్పదంట!
X

మేష రాశి : మీ ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. ఈరోజుమీయొక్క పనులకు విరామముఇట్చి మీరు మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు.. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం.

వృషభ రాశి : చాలా జాగ్రత్తగా మెదలాలి ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. అనుకోని వ్యక్తుల రాక వలన మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు ఈరోజు మీరు అధిక ఒత్తిడి వలన ముఖ్యమైన పనులు చేయలేరు. ఏ విషయంలోనైనా సరే ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

మిథున రాశి : ఈ రాశి వారు నేడు స్థిర పడిన, పేరుపొందిన వ్యాపారల్లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్త అవసరం. ఈ రోజు మొత్తం చాలా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కర్కాటకం ఆరోగ్యం కుదుట పడుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు ఎట్టకేలకు చేతికందుతాయి. ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగాను అద్భుతంగాను ఉంటుంది.

సింహ రాశి : ఖర్చులు అధికం అవుతాయి. అందువలన ఖర్చులను మదుపు చేసుకోవడం చాలా మంచిది. మిత్రులతో సాయంత్రం చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చేరోజు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

కన్యారాశి : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

తుల రాశి : రాజకీయ, ప్రభుత్వ పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వాహనం కొంటారు. కుటుంబంలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొన్ని సర్దుబాట్లు అవసరం పడతాయి.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయి.

వృశ్చిక రాశి : మీ ఇంట్లో వారిని సంతోష పెట్టేందుకు మీరు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అసలట, ఒత్తిడి అధికం అవుతుంది. మొడి బకాయిలు వసూలవుతాయి. కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు అడుగుతారు. ఈ రోజు మీ దగ్గరి బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మీ వ్యాపార విషయాలు ఇతరులతో పంచుకోక పోవడం మంచిది.

ధనుస్సు రాశి : ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులు, ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయాన్ని వృథా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

మకర రాశి : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విందు వినోదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో పెట్టు బడులు పెట్టకపోవడం మంచిది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు సాయంత్రం ప్రశాంతంగా గడుస్తుంది.

కుంభ రాశి :ఈరోజు మీకుమీమనస్సుకు బాగా దగ్గరైనవారికి గొడవలుజరిగేఅవకాశము ఉన్నది,దీనివలన మీరు న్యాయస్థానంమెట్లుఎక్కవలసి ఉంటుంది.దీనివలన మీరుకస్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి.


మీన రాశి : కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అధికారులతో స్నేహం పెంపొందించుకుంటారు. సమయానికి తగ్గటు నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.

Also Read: Telugu Panchangam : 17 ఫిబ్రవరి నేడు శుభ, అశుభ సమయాలివే!

Next Story

Most Viewed