- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరాశి వారి సమస్యలన్నీ తీరిపోయే అవకాశం
ఈరాశివారికి ఈరోజు కలిసివచ్చే రోజగా చెప్పవచ్చు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది

మేష రాశి : ఈ రాశివారికి ఈరోజు అన్నింట్లో కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. ఎందులోనైనాన పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త అవసరం.
వృషభ రాశి : ఈరోజు మీకు డబ్బు విలువ బాగా తెలుస్తోంది. అందువలన ఖర్చులను తగ్గించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మిథున రాశి : ఈరోజు ఈ రాశివారు శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. మానసికంగా ధైర్యం కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపరంగా శ్రద్ధ అవసరం. కుటుంబంతో కలిసి టూర్ వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : సమస్యలన్నీ తీరిపోపయే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీని వలన మీరు మానసిక సంతృప్తి పొందగలరు. ఈరోజు మీరు ఎక్కువగా స్నేహితులతో గడపడానికి ఆసక్తి చూపుతారు. ఆరోగ్యపరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహ రాశి : వ్యాపారస్థులకు ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ స్నేహితుడు ఇచ్చే సలహా పాటించినట్లైతే అదృష్టం కలిసి వస్తుంది. సెమినార్లకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం మీరు ఊహించని విధంగా అద్భుతంగా ఉంటుంది.
కన్యారాశి : చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. చిన్నతనం నాటి గుర్తులన్నీ మిమ్ముల్ని ఆకర్షిస్తాయి. ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టిన ఫ్లాట్ ఈరోజు మ్ముడు పోయే అవకాశం ఉంది. దీంతో అత్యధిక లాభాలు గడిస్తారు. కుటుంబంలో గత కొంత కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఓకొలిక్కీ వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి : మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీరు కోపాన్ని అదుపుచేసుకోవాలి, లేకపోతే, అదే మీమధ్యన అవరోధం సృష్టిస్తుంది. మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీరైపోతుంది. ఈరాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు,అయినప్పటికీ మీరు విచారించాల్సిన పనిలేదు, ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచిఫలితాలను అందుకుంటారు.
వృశ్చిక రాశి : ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసి, అధికంగా ఖర్చు పెడుతుంటారు. ఉద్యోగస్థులు, సహోద్యోగులు, సీనియర్ల నుంచి పూర్తి సహాకారం అందించడంతో ఆఫీసులో పని త్వరగా అయిపోతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది.
ధనస్సు రాశి : ఈ రోజు మీరు మీ వ్యాపారాభివృద్ధి కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. మీ కు ఇష్టమైన వారి నుంచి కాల్ రావడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పాడవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకర రాశి : బయట కార్యక్రమాలు ఈరోజు మీకు అలసట, ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రోజు మీకుటుంబ సభ్యులు మీరు చేసే పనులపట్ల సానుకూలంగా స్పందిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
కుంభ రాశి : ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ ,కొన్ని కారణాలవలన మీరు ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇదిమీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీ కుటుంబం సభ్యులతోగల విభేదాలను తొలగించుకోవడమ్ ద్వారా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
మీనరాశి : మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీ కుటుంబంలోని కలహాలు చికాకు పరుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.






