Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (29-04-2025)

by Kodari Anjali |   (  Updated:2025-04-28 21:45:41  IST  )

కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో కలిసి ఎక్జైటింగ్ పనులు చేస్తుంటారు

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (29-04-2025)
X

మేష రాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో కలిసి ఎక్జైటింగ్ పనులు చేస్తుంటారు. పెద్దవారి సలహాలు తీసుకుంటారు. రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.

వృషభ రాశి: నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు.కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి.

మిథున రాశి: పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది.

కర్కాటక రాశి:ఓటమి పాలవుతారు. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు.

సింహ రాశి: తొందరగా బయట పడేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. శుభవార్తలు వింటారు.

కన్యా రాశి: మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి.

తులా రాశి: బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. కానీ అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

వృశ్చిక రాశి: పిల్లల్ని బాగా మోటివేట్ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కుతుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోంటారు. నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు.

ధనుస్సు రాశి: మీరు ఊహించనివారి నుంచి డబ్బు అందుకుంటారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు.

మకర రాశి: ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా గడుపుతారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో పలు గొడవలు జరుగుతాయి. బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు.

కుంభ రాశి: దీంతో రిలాక్స్ అవుతారు. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

మీన రాశి: మీరు చేసిన ఏ పనులు అయినా సరే మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తాయి. ఫ్రెండ్స్ తో కలిసి పిక్‌నిక్ వెళ్తారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవండి. యోగా చేయడం మంచిది. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది.భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.

Next Story