Today's horoscope:ఆ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త!

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది.

Todays horoscope:ఆ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త!
X

దిశ,వెబ్‌డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజు(మే 05, మంగళవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఎదురయ్యే సూచన ఉంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి

శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి

ఈ రాశి వారు ఇవాళ వృత్తి, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బంధు మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు దారితీసే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి

గతంలో నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

సింహ రాశి

కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంలో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. అవివాహితులకు అనుకూలమైన సంబంధం దొరుకుతుంది.

కన్య రాశి

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కానీ ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం మంచిది. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి.

తుల రాశి

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. వైవాహిక బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి

సన్నిహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా పనులు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రేమికులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంభాషణల్లో సంయమనం అవసరం.

ధనుస్సు రాశి

ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న సమస్యలు తీరుతాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంబంధాలు ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి.

మకర రాశి

పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. అనవసర ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. దైవ దర్శనాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. మౌనం వహించడం మంచిది.

కుంభ రాశి

ఆర్థికంగా చాలా బాగుంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో హోదాలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు.

మీన రాశి

కొత్త పరిచయాలు వ్యాపారానికి ఉపయోగపడతాయి. ఉద్యోగ లాభం చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీంతో ఆర్థికంగా ఏ లోటు ఉండదు. ఆత్మీయుల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న వారితో వివాహం నిశ్చయమయ్యే సూచన ఉంది.

Next Story