- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో అదృష్టం పీక్‌కి చేరే రాశులు ఇవే.. పట్టిందల్లా బంగారమే!?
వచ్చే ఏడాదిలో లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం..

దిశ,వెబ్‌డెస్క్: ఈ ఏడాది(2025) చివరి నెల వచ్చేసింది. ఇక, మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది(2026)కి స్వాగతం చెప్పబోతున్నారు. అయితే.. చాలా మంది నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు తమకు కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఉంటారు. ఈ తరుణంలో కొందరైతే జ్యోతిష్య నిపుణులను కూడా సంప్రదిస్తారు. గడిచిన ఏడాదిలో అనుభవించిన కష్టనష్టాలు డిసెంబర్‌తో ముగిసిపోయి నూతన ఏడాదిలోకి అడుగుపెట్టాలని భావిస్తారు. ఈ క్రమంలో తాము రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుందోనని ఉత్సుకతతో ఉంటారు.
అయితే.. వచ్చే న్యూయర్‌లో రాశి చక్రంలోని కొన్ని రాశులపై గ్రహధిపతి అయిన సూర్యుడి ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీంతో ఆయా రాశులకు సంబంధించిన వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అధిక లాభాలు గోచరిస్తున్నాయి. అంతేకాదు.. 2026 లో పెద్ద గ్రహాలు రాశి సమాచారంతోపాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీంతో వచ్చే ఏడాదిలో లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం..
*నూతన ఏడాది వృషభ రాశి, కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం పరంగా మంచి లాభార్జన ఉంటుంది. గతంలో కంటే ఆర్థికంగా ఇప్పుడు బలపడతారు. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది.
*తుల, మకర రాశి ఒకరకంగా 2026 వీరికి అద్భుతమని చెప్పవచ్చు. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి.
*వృశ్చిక రాశి, మీన రాశి వారు కొత్త సంవత్సరంలో ఖర్చులు తగ్గించుకోకపోతే భారీగా నష్టపోతారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.
*గత ఏడాదితో పోల్చితే కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి, కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కానీ, పెట్టుబడులు పెట్టే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెద్దల నుంచి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
*మేషరాశి, సింహరాశి వారికి నూతన ఏడాదిలో ఖర్చులు అధికమవుతాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చేపట్టిన పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ, మీ పట్టుదలతో కృషి చేస్తే మంచి లాభాలు ఉన్నాయి. ఈ రాశులవారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, పూజించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.
NOTE: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.






