- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope: ఎవరికి లాభం? ఎవరికి నష్టం.. ఈ రోజు రాశి ఫలాలు ఇవే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. చంద్రుని సంచారం, గ్రహాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. చంద్రుని సంచారం, గ్రహాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.. ఈ రోజు(ఫిబ్రవరి 23) కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వచ్చే సూచనలు ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో మరియు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ రోజు ఏ పనైనా ప్రశాంతమైన చిత్తంతో ప్రారంభిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మేష రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది.
మిథున రాశి
ఈ రాశి వారు మిత్రుల సహాయంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగంలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఇది మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహ రాశి
ఈ రాశికి చెందిన వారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన యోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కన్య రాశి
ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మాట విలువ ఏంటో ఈరోజు తెలుసుకుంటారు. కుటుంబ పెద్దలు సలహాలు ఉపయోగపడతాయి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు అందుకుంటారు.
తుల రాశి
ఈ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఆర్థికంగా కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. రుణ విముక్తికి మార్గాలు సుగమం అవుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి సమయం గా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు, ఓపికతో ఉండాలి. ఇంటి పనుల వల్ల అలసటగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరగవచ్చు. ఉద్యోగ స్థాన చలనం ఉంది.
కుంభం
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మీనం
ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.






