- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:చంద్రుడు వృషభ రాశిలో సంచారం.. ఆ రాశుల వారికి గడ్డు కాలమే!
గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజు(ఏప్రిల్ 20, సోమవారం) చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. కావున 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. బంధువులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు వద్దు. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. శివరాధాన మేలు చేస్తుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. ప్రయాణాల్లో శ్రమ అధికమవుతుంది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. కానీ, దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు శివాలయాలకు వెళ్లి పూజలు చేయడం మంచిది.
కన్య రాశి
కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మీరు అనుకున్న పనులు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
తుల రాశి
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే, ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి.
ధనస్సు రాశి
కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభసమయంగా చెప్పవచ్చు.
మకర రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన లేదా గృహ యోగం కనిపిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన మేలు చేస్తోంది.
కుంభ రాశి
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీదే పైచేయి అవుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
మీన రాశి
అధికారుల సహకారం లభిస్తుంది. సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ధనయోగం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.






