- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shani: శని గ్రహం ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
గ్రహాలన్నింటిలో శని దేవుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలన్నింటిలో శని దేవుడికి ( shani ) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం సంచారం చేయడం వలన 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, కొన్ని రాశులవారికి శనిదేవుని అనుగ్రహం పొందడం వలన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. శని దేవుడు ఒక్కసారి కరుణిస్తే పేద వాళ్ళు కూడా ధనవంతులవుతారు. అయితే, త్వరలోనే శని గ్రహం సంచారం చేయబోతోంది. శని గ్రహం ఫిబ్రవరి 28 నుంచి కదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా, కొన్ని రాశుల వారు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కర్కాటక రాశి ( Karkataka Rasi )
శని కదలికల కారణంగా ఈ రాశి వారికీ శుభంగా ఉంటుంది. జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. పాత కాలంలో కూడా కొన్న భూములకు రేట్లు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా పెట్టారు. అంతేకాకుండా, ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి కానీ యువతీ యువకులకు వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, వ్యాపారాల్లో వీరు ఊహించని విజయాలు కూడా సాధిస్తారు.
మీన రాశి ( Meena)
శని కదలికల కారణంగా ఈ రాశి వారు ఎన్నో లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అలాగే, వీరు మొదలు పెట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






