Today's horoscope: ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల ఫలితాలు ఇలా!

by Jakkula.Mamatha |

కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

Todays horoscope: ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల ఫలితాలు ఇలా!
X

మేష రాశి

ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా చాలా వరకు శుభఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి

వీరికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో మరింత గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలు తీసుకోవాలి. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వైవాహిక జీవితం బాగుంది.

మిథున రాశి

గత కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఆకస్మిక ధన యోగం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

కన్య రాశి

వృత్తి, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, లక్ష్యాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

తుల రాశి

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. సమయానికి డబ్బులు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలకు వెళ్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు మరింత కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దీంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనుస్సు రాశి

వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని నింపుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

మకర రాశి

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కొందరు బంధువులకు, సన్నిహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

కుంభ రాశి

ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

మీనరాశి

ఈ రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Next Story