Today's horoscope : మార్చి 21 రాశి ఫలాలు.. ఇవాళ‌12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

by Nallavelli.Anjaneyulu |

ఇవాళ రాశి ఫ‌లాల్లో ఏ రాశి వారికి క‌లిసొస్తుందో.. ఏయే రాశుల వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Todays horoscope : మార్చి 21 రాశి ఫలాలు..  ఇవాళ‌12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
X

Today Horoscope: సాధార‌ణంగా ప్ర‌తిరోజు ఉద‌యం లేవ‌గానే ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..? ఎవ‌రికి అదృష్టం క‌లిసి వ‌స్తుంది..? ఆర్థిక ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విష‌యాలను తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తుంటాం. ఇవాళ ఏయే రాశుల వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మేష రాశి :

వృత్తి, ఉద్యోగాల్లో ఫ‌లితం ల‌భిస్తుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో మీ జీవిత భాగ‌స్వామి స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మం. దూర‌పు ప్ర‌యాణాల వ‌ల్ల ఆశించిన లాభాలు క‌లుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబ‌డుల‌కు లాభాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న ప్రాప్తి పొందే అవ‌కాశ‌ముంది.

వృషభ రాశి :

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పుంజుకుంటాయి. కుటుంబ స‌భ్యుల‌కు మీరు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఉప‌యోగ‌ప‌డుతాయి. ఆస్తి వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. ఆస్తికి సంబంధించి ఓ శుభ‌వార్త వింటారు.

మిథున రాశి :

ఉద్యోగుల‌కు ఉన్న‌తాధికారుల నుంచి ఆశించిన స‌హాయ‌, స‌హ‌కారాలు ల‌భిస్తాయి. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో లాభాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగం పొందే అవ‌కాశం ఉంది. కుటుంబ స‌భ్యుల నుంచి ఆశించిన ఫ‌లితాలు ల‌భిస్తాయి.

కర్కాటక రాశి :

ఉన్న‌తాధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం ఉత్త‌మం. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కుటుంబంలో కొద్ది చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది.

సింహ రాశి :

వృత్తి, వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. ఖ‌ర్చుల విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచించ‌డం ఉత్త‌మం. కొంద‌రు మిత్రుల‌కు ఆర్థికంగా స‌హాయం చేస్తారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి.

కన్య రాశి :

మీ ప‌ని తీరుతో అధికారుల‌ను, తోటి ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మ‌ధ్య వ‌ర్తుల కార‌ణంగా ఆస్తి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.

తుల రాశి :

ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో సానుకూల స్పంద‌న ల‌భిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో క‌లిసి వ‌స్తుంది. కుటుంబ ప‌రంగా సంపాదన విప‌రీతంగా పెరుగుతుంది. పెళ్లి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి.

వృశ్చిక రాశి :

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్య‌త‌లు పెరుగుతాయి. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. సొంత ప‌నుల మీద శ్ర‌ద్ధ పెట్ట‌డం ఉత్త‌మం.

ధనుస్సు రాశి :

అనుకున్న ప‌నులు అనుకున్నవిధంగా పూర్తి అవుతాయి. ఆదాయం పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి. నిరుద్యోగుల‌కు ఉద్యోగ ఆఫ‌ర్లు ల‌భిస్తాయి. పిల్ల‌లు చ‌దువుతో పురోగ‌తి సాధిస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో లాభాలు వ‌స్తాయి.

మకర రాశి :

అధికారులు, తోటి ఉద్యోగులు ఎక్కువ‌గా మీపైనే ఆధార‌ప‌డుతారు. ఆర్థిక ప‌రిస్థితి అనుకూలంగా ఉంటుంది. స‌కాలంలో డ‌బ్బు చేతికి అందుతుంది. ప్ర‌యాణాల్లో ఫ‌లితాలు ల‌భిస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

కుంభ రాశి :

నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు. ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డం చాలా ఉత్త‌మం. జీవిత భాగ‌స్వామి సూచ‌న‌లు పాటించండి. పెళ్లిళ్లు, శుభ‌కార్యాల్లో పాల్గొంటారు.

మీన రాశి :

మీ ఉద్యోగంలో గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. ఆహార విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ఉత్త‌మం. కొత్త స్థ‌లం కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

Next Story