- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope: వారికి అదృష్టయోగం.. ఈ రోజు 12 రాశుల ఫలితాలు ఇవే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావాన్ని చూపుతుంది.

Today's horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావాన్ని చూపుతుంది. ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ మార్పులు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే విజయాలు, సవాళ్లు మరియు అవకాశాలకు సంకేతాలుగా నిలుస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ తరుణంలో ఇవాళ(ఆదివారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి: ఆర్థికంగా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు. అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
మిథున రాశి: వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మాటపట్టింపులకు పోవద్దు. కంటి సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త. అనవసర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వద్దు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
సింహ రాశి: పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. చిన్నపాటి ధనలాభం సూచన ఉంది.
కన్య రాశి: దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయుల నుండి కానుకలు అందుకుంటారు. ఆహార నియమాలు పాటించండి.
తుల రాశి: శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. రుణ విముక్తి కలుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. అదృష్ట యోగం ఉంది.
వృశ్చిక రాశి: సంతాన పరమైన ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో మనస్పర్థలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. ఇష్ట దైవ ప్రార్థన ఉత్తమం.
ధనుస్సు రాశి: ఇంటి వాతావరణం సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.
మకర రాశి: ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల మద్దతు లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విషయంలో ఆందోళన తొలగుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు.
కుంభ రాశి: మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మీన రాశి: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అధికారులతో సానుకూలత ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు నూతన వస్తు, వస్త్ర లాభాలు సూచిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.






