Today's horoscope:నమ్మిన వారే మోసం చేసే ఛాన్స్.. 12 రాశుల ఫలితాలు ఇవే!

by Jakkula.Mamatha |

నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Todays horoscope:నమ్మిన వారే మోసం చేసే ఛాన్స్.. 12 రాశుల ఫలితాలు ఇవే!
X

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు(శనివారం) గ్రహ సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం.

మేష రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరపాటు పనికిరాదు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా, సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. కానీ శ్రమకు తగ్గి ఫలితం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయంలో ఇబ్బందులు రావచ్చు. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. రుణ సమస్యలు తొలగిపోయి, ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించిన శుభవార్త వింటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం గా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల కాస్త ఒత్తిడి గా ఫీల్ అవుతారు. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య పరిష్కారం కావడంతో ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి

ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల రాశి

వ్యాపార రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ రోజు మొత్తం బిజీబిజీగా గడుపుతారు. ఉద్యోగంలో బాధ్యతలు మారిపోతాయి. చేపట్టిన పనులు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృశ్చిక రాశి

వీరికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. దీంతో ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్న మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. మనసులోని రెండు కోరికలు నెరవేరుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

మకర రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మొత్తానికి ఈ రాశి వారికి ఇవాళ అనుకూల ఫలితాలు ఉన్నాయి.

కుంభ రాశి

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మీన రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందదు. ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. బంధువులు సాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Next Story