- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Horoscope results: శ్రీరామనవమి తర్వాత నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ మార్పులు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే విజయాలు, సవాళ్లు మరియు అవకాశాలకు సంకేతాలుగా నిలుస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నెల 26న చంద్రుడు, గురు గ్రహాలు కలవనున్నారు. ఈ రెండు గ్రహాలు కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ గ్రహాలు కలవడంతో శ్రీరామనవమి తర్వాత నుంచి నాలుగు రాశులకు అదృష్టయోగంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ నాలుగు రాశులేవి అంటే.. మేషం, మిథునం, సింహం, వృశ్చికం. ఈ రాశుల వారికి ఈ నెల 26వ తేదీ నుంచి విశేషమైన అదృష్ట యోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ(శుక్రవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఈ రాశి వారికి శ్రీరామనవమి తర్వాత నుంచి అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి
పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సహనం కోల్పోకుండా పనులు చక్కబెట్టుకోవడం మంచిది. ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
మిథున రాశి
ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఇదిలా ఉంటే.. మిథున రాశి వారికి శ్రీరామనవమి తర్వాత నుంచి జీవితం మారిపోనుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ పిల్లల విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక నెరవేరుతుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు కూడా పెడతారు.
కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం.
సింహ రాశి
ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇదిలా ఉంటే.. ఈ రాశి వారికి శ్రీరామనవమి తర్వాత నుంచి రాజయోగం పడుతుంది. సామాజికంగా మీ గౌరవం రెట్టింపు అవుతుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి కీలక పదవులు దక్కుతాయి. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించి, సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా ఉద్యోగులకు మార్గం సుగమం అవుతుంది.
కన్య రాశి
ఈ రాశి వారు ఇవాళ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు.
తుల రాశి
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తిపరంగా శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇదిలా ఉంటే.. శ్రీరామనవమి తర్వాత నుంచి శని దేవుని అనుగ్రహం మరియు గ్రహాల అనుకూలత వల్ల వృశ్చిక రాశి వారికి తిరుగులేని విజయం లభిస్తుంది. కోర్టు కేసులు లేదా శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ధనుస్సు రాశి
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అనుకున్నవి సాధిస్తారు. సంతాన పరంగా అనుకూల వార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మకర రాశి
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. పై అధికారుల మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి
సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
మీన రాశి
గందరగోళానికి లోనుకాకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, సర్దుకుపోవడం మంచిది.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు.






