- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఈ రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
ఈ రాశి వారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(ఆదివారం) మహాశివరాత్రి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సందర్భంగా 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు మానుకోండి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల గొడవల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది. శివనామ స్మరణం చేయండి.
వృషభ రాశి
ఈ రోజు వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు చదువులో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఇవాళ ఎక్కువగా విజయాలు సాధిస్తారు. అనుకోకుండా బంధు, మిత్రులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వారికి అభివృద్ధి ఉంటుంది. శివనామం స్మరించుకోండి.
మిథున రాశి
ఈరాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. గతంలో కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఇతరులతో దురుసుగా ప్రవర్తించకుండా, గొడవల్లో జోక్యం చేయకపోవడమే మంచిది. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. పరమేశ్వరుడిని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఈ వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగంలో కాస్త పట్టుదలతో పని చేయడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్త వినే ఛాన్స్ ఉంది. మనో ధైర్యంతో ముందుకెళ్తారు. శివుడిని ఆరాధించండి.
కన్య
ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు.
తుల
ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన యోగం ఉంది. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. నూతన పనులు చేపట్టే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి
ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గించి పొదుపు దిశగా అడుగులు వేస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళన వేధిస్తోంది. బంధు మిత్రులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
మకర రాశి
ఈ రాశికి చెందిన కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలియక ఆనందాన్ని ఇస్తోంది. సంఘంలో పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు.
కుంభ రాశి
ఈ రాశి వ్యక్తులు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మీన రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే ఛాన్స్ ఉంది. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ పెద్దల సలహాలు సమస్యల నుంచి బయటపడేస్తాయి. ఇష్టదైవారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.






