- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Astrology: బుధాదిత్య రాజయోగం.. ఆ రాశుల వారికీ లాటరీ తగిలినట్లే..!
2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. త్వరలో, బుధుడు ధనుస్సు రాశిలోకి సంచరించనున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికీ ఆకస్మిక డబ్బు రానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి: బుధాదిత్య రాజయోగం వలన సింహ రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అలాగే, కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం. మీ ఇంటికి అతిధులు రావడం వలన ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది.
మేష రాశి : బుధాదిత్య రాజయోగం వలన మేష రాశి వారికీ కలిసి వస్తుంది. బుధుడి అనుగ్రహంతో మీరు చేయాలనుకున్న పనులను చేస్తారు. అంతేకాకుండా, చాలా కాలం నుంచి నిలిచిపోయిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ పనిని సీనియర్లు మెచ్చుకుంటారు. దీంతో, మీ జీతం పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






