65,651 హోండా కార్లు వెనక్కి!

by  |
65,651 హోండా కార్లు వెనక్కి!
X

ముంబయి: హోండా ఇండియాకు చెందిన సిటీ, అమేజ్, జాజ్ లాంటి కొన్ని మోడళ్లలో ఫ్యూయల్ పంపు సమస్య ఉండటంతో వాటిని మార్చడానికి 65,651 కార్లను వెనక్కి తెప్పిస్తున్నట్టు హోండా వెల్లడించింది. సమస్యను గుర్తించి హోండా కంపెనీయే స్వయంగా మార్చడానికి ముందుకొచ్చింది. 2018లో ఉత్పత్తి చేసిన ఈ వాహనాల్లో ఫ్యూయల్ పంపులు సరిగ్గా అమర్చకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఇంజిన్ సమస్యలు వస్తాయని, ఆ ప్రభావాన్ని పరిష్కరించేందుకు ఆ వాహనాలన్నింటినీ వెనక్కి తెప్పిస్తున్నట్టు హోండా కంపెనీ స్పష్టం చేసింది. ఇక, ఫ్యూయల్ సమస్యతో వెనక్కి వస్తున్న వాహనాల్లో హోండా అమేజ్ 16,434 యూనిట్లు, సిటీ మోడల్ కార్లు 7,500, జాజ్ 7,057, డబ్ల్యూ-వీ మోడల్ కార్లు 1,622, బీఆర్-వీ 360, బ్రియ్ 180 యూనిట్ల వాహనాలు ఉన్నాయని చెప్పారు. ఈనెల 20 నుంచి దశలవారీగా అన్ని విక్రయ కేంద్రాల వద్ద ఉచితంగా ఫ్యూయల్ పంపులను మార్చనున్నట్లు, ఇందుకోసం వాహన యజమానులను వ్యక్తిగతంగా సంప్రదిస్తామని హోండా ఇండియా తెలిపింది.


Next Story

Most Viewed