- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శభాష్ పోలీస్.. వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన హోంగార్డు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే బుగ్గవంక పరివాహక ప్రాంతం శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో ఓ వృద్ధురాలు చిక్కుకుపోయింది. ఈ విషయం గమనించిన హోమ్ గార్డ్ రమేష్ (హెచ్.జి 208) సాహసోపేతంగా వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన మహిళను ఎత్తుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహిళతోపాటు భర్త కూడా ఉండటంతో అతడిని హోంగార్డు సురక్షితంగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే బుగ్గవంక పరివాహక ప్రాంతం శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో ఓ వృద్ధురాలు చిక్కుకుపోయింది. ఈ విషయం గమనించిన హోమ్ గార్డ్ రమేష్ (హెచ్.జి 208) సాహసోపేతంగా వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన మహిళను ఎత్తుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మహిళతోపాటు భర్త కూడా ఉండటంతో అతడిని హోంగార్డు సురక్షితంగా రక్షించారు. అనంతరం వారిని ఆటోలో సహాయ శిబిరానికి పంపించారు. ఈ సందర్భంగా స్థానికులు..హోంగార్డు రమేశ్‌తో పాటు కడప జిల్లా పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ హోంగార్డు రమేష్‌ను అభినందించారు.
Next Story






