- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంగార్డును బలి తీసుకున్న గుండెపోటు..
by Batti.Sumithra |
<p>దిశ, తుంగతుర్తి : అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హోంగార్డు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. దేవునిగుట్టకు చెందిన గూగులోతు పకీరా(45) భువనగిరి పట్టణంలో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పని ఉండి 2 రోజుల కిందట ఆయన స్వగ్రామానికి వచ్చారు. వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన […]</p>

X
దిశ, తుంగతుర్తి : అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హోంగార్డు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. దేవునిగుట్టకు చెందిన గూగులోతు పకీరా(45) భువనగిరి పట్టణంలో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పని ఉండి 2 రోజుల కిందట ఆయన స్వగ్రామానికి వచ్చారు. వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పకీరా మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






